బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 9 జులై 2019 (20:50 IST)

పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి....

సాధారణంగా సీజన్ మారగానే ముఖ్యంగా జలుబు ఎక్కువ ఇబ్బందిపెడుతుంది. దీనిని అశ్రద్ద చేయడం వలన జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఎన్ని మందులు వాడినా జలుబు త్గగకుండా వేదిస్తూ ఉంటుంది. మందులు కన్నా కూడా కొన్ని చిట్కాల ద్వారా జలుబును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. జలుబును తగ్గించడంలో తులసి ఒక మంచి ఔషదంలా పని చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల జలుబుని తగ్గించుకోవచ్చు. అలాగే తులసి టీ తాగినా జలుబు తగ్గుతుంది.
 
2. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి ఆ తరువాత ఆ నీటిని వడగట్టి, దీనికి కొద్దిగా తేనె కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
 
3. వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే త్వరితగతిన జలుబును పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే సమయంలో గోరువెచ్చని పాలు తాగడం వలన జలుబు అంతగా బాదించదు.
 
4. పావులీటరు నీళ్లల్లో మూడు యూకలిప్టస్ ఆకులు వేసి కాసేపు మరిగించి వరుసగా నాలుగు రోజులు తాగడం వలన జలుబు తగ్గుతుంది.