గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (11:48 IST)

ప్రతిరోజూ బెల్లం తీసుకుంటే? ఆస్తమా వ్యాధికి?

బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ సరిగ్గా జరిగేట్టుగా ఉపయోగపడుతుంది. పొటాషియం శరీరంలోన

బెల్లం రోగనిరోధకశక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. పాలలో బెల్లం తరుగును వేసి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. జీవక్రియ సరిగ్గా జరిగేట్టుగా ఉపయోగపడుతుంది. పొటాషియం శరీరంలోని ఎలక్ట్రొలైట్స్‌ను సమతుల్యం చేస్తుంది. కండరాలను పెంచడమేకాకుండా పటిష్టం చేస్తుంది.
 
శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని హిమోగ్లోబిన్ ప్రమాణాన్ని పెంచుతుంది. ఐరన్, ఫొటేట్‌లు బెల్లంలో ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత తగ్గుతుంది. ఎర్రరక్త కణాలు కూడా సాధారణ ప్రమాణంలో కొనసాగుతాయి. బెల్లం ప్రతిరోజూ తీసుకోవడం వలన శరీరంలోని ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే విటమిన్స్, మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి.
 
జలుబు, దగ్గు, తలనొప్పులకు బెల్లం బాగా పనిచేస్తుంది. గొంతుమంటని తగ్గిస్తుంది. బెల్లంలో క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ ప్రమాణాల్లో తేడాలు తలెత్తుతాయి. రక్తపోటు, గుండెజబ్బులు వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైన ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులకు  తగ్గిస్తుంది.