నుదుట బొట్టుపెట్టుకునే ప్రాంతంలో వేలితో మసాజ్ చేస్తే కలిగి ఫలితమేంటి?

ప్రస్తుతం కాలంతో పాటు.. మనిషి కూడా పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ముఖ్యంగా.. ఇంట్లోనే కాకుండా, ఆఫీసుల్లో, చివరకు ప్రయాణం చేసే సమయంలోనూ మనిషి ఒత్తిడిని

శుక్రవారం, 15 జులై 2016 (11:42 IST)
ప్రస్తుతం కాలంతో పాటు.. మనిషి కూడా పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు. ముఖ్యంగా.. ఇంట్లోనే కాకుండా, ఆఫీసుల్లో, చివరకు  ప్రయాణం చేసే సమయంలోనూ మనిషి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో కాస్తంత రిలాక్స్ పొందాలంటే చిన్నపాటి టెక్నిక్స్‌ను పాటిస్తే చాలు. అవేంటో పరిశీలిద్ధాం. 
 
నుదుటిపై బొట్టు పెట్టుకునే భాగంలో చేత్తో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. ఇలా చెయ్యడం వల్ల రిలాక్స్ అవ్వడమే కాదు, చేసే పనిపై ఏకాగ్రత కూడా పెరుగుతుందట. అలాగే, తల నొప్పి తగ్గడం, కంటి భాగం దగ్గరి చర్మాన్ని రిలాక్స్ అవుతాయి. 
 
అయితే, బొట్టుపెట్టుకునే భాగంలో మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. బొట్టుపెట్టుకునే భాగాన్ని ఏదైనా ఒక వేలితో సున్నితంగా నొక్కి పట్టుకోవాలి. అక్కడ నుంచి పైకి, కిందికి, చుట్టుపక్కల వేలితో స్పృసిస్తూ మెల్లగా మసాజ్ చెయ్యాలి. 
 
అలా కొన్ని నిమిషాల పాటు చేయడం వల్ల ఎంతో హాయిగా ఉండటమే కాకుండా, ఒత్తిడి నుంచి కాస్తంత రిలీఫ్ అయిన భావన కలుగుతుంది. ప్రధానంగా మెదడులోని నరాలపై ఉండే టెన్షన్ తగ్గిపోతుందట. కంటి చూపులో కూడా స్పష్టత వస్తుందట.

అన్నీ చూడండి

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

వందరూపాయలతో మ్యాగీ, కూల్‌డ్రింక్స్‌తో బర్త్ డే చేసుకున్న బాలుడు.. వీడియో వైరల్

అన్నీ చూడండి

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments