షాపుల్లో బియ్యం పిండి కొంటున్నారా? బ్యాక్టీరియాలు, పురుగులు ఫ్రీగా వస్తాయ్ జాగ్రత్త!!

బియ్యం పిండి కొంటే వాటితోపాటు పురుగులు, బ్యాక్టీరియాలు ఫ్రీ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో కార్పొహైడ్రేడ్లు, ఉద్దిపప్పులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికీ మేలు చేసేవే. అయితే ఇంట్లో రుబ్బుక

గురువారం, 23 జూన్ 2016 (16:45 IST)
ఆలుమగలు ఆఫీసులకు పరుగులు తీస్తున్న నేటి యుగంలో ఇడ్లీలకు, దోసెలకు పిండి రుబ్బుకునే స్టైల్ పాతదైపోయింది. ఆఫీసు నుంచి పోతూ పోతూ ఓ బియ్యం పిండి ప్యాకెట్ కొనుక్కెళ్లి... దోసెలు, ఇడ్లీలు తయారు చేసి.. తిని నిద్రించే కుటుంబాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మీరూ ఇలా ఇంట్లో పిండి రుబ్బుకోకుండా షాపుల్లో రుబ్బి ప్యాకెట్లలో ఉంచే బియ్యం పిండిని కొంటున్నారా? అయితే జాగ్రత్త పడండి. 
 
బియ్యం పిండి కొంటే వాటితోపాటు పురుగులు, బ్యాక్టీరియాలు ఫ్రీ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో కార్పొహైడ్రేడ్లు, ఉద్దిపప్పులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికీ మేలు చేసేవే. అయితే ఇంట్లో రుబ్బుకునే పిండి సంగతి ఏమో కానీ.. షాపుల్లో దొరికే బియ్యం పిండి పాకెట్లలో బ్యాక్టీరియాలు, పురుగులుండక తప్పవని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
ఇంట పిండి రుబ్బే పనైతే బియ్యాన్ని శుభ్రం చేసుకుని రాళ్లు, వడ్లు ఏరుకుని ఆపై నానబెట్టి రుబ్బుకుంటాం. అదే కిలోల లెక్కన పిండిని రుబ్బే షాపుదారులు బియ్యంలోని రాళ్లను శుభ్రం చేస్తారా అనేది ప్రశ్నార్థకం. నీరు, ఉద్దిపప్పు విషయంలోనూ నాణ్యత ఉంటుందా అనేది చూసుకోవాలి. పిండి రుబ్బే పాత్రలు, ఉపయోగించే వస్తువులు శుభ్రంగా ఉంటాయా అనేది కూడా చూడాలి. అంతేగాకుండా షాపుల్లో అమ్మే పిండిలో సోడా ఉప్పు కలపడం.. ఇంకా కొన్ని రసాయనాలు కలపడం వంటివి ద్వారా ఆరోగ్యానికి కీడు చేసే బ్యాక్టీరియాలు పిండి వెంటే ఫ్రీగా మనింటికి వచ్చి.. మన ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 
 
షాపుల్లో అమ్మే బియ్యంపిండిని ఉపయోగించడం ద్వారా ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడే అవకాశం ఉంది. శుభ్రతలేమి కారణంగా బిండి రుబ్బేటప్పుడు చేతుల ద్వారా పిన్ వామ్, హుక్ వార్మ్ (Pin worm, Hook worm) అనే పురుగులు కూడా పిండిలో చేరుతాయి. వీటితో రక్తహీనత, విరేచనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకే బియ్యం పిండి కొనేటప్పుడు నాణ్యతను బేరీజు వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఈ మధ్య షాపుల్లో అమ్మే బియ్యం పిండిపై ఆహార నాణ్యత విభాగం నిర్వహించిన పరిశోధనలో ఇ-కోలి అనే బ్యాక్టీరియా అంగట్లో అమ్మే బిండిలో ఉన్నట్లు కనుగొన్నారు. అందుచేత ఇంట్లో రుబ్బుకునే పిండికే ప్రాధాన్యత ఇవ్వాలని, షాపుల్లో బియ్యం పిండిని కొనడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

దేశంలోనే అత్యంత ధనిక రాజ్యసభ్యుడు ఎవరో తెలుసా? మన తెలుగు నేతే!

Pawan Kalyan: పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ దీక్ష

మిరప ఎగుమతుల్లో పురుగుమందు.. సమస్య పరిష్కారానికి ఏపీ కమిటీ

6జీ, ఏఐ క్వాంటం టెక్నాలజీస్ కోసం రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్

అన్నీ చూడండి

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

జంగా నుంచి పోలీస్ ఆపీసర్ గా గగన్ బాబు స్పెషల్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments