ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2017 (12:00 IST)

పంటిపై గల మచ్చలు తొలగిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ దివ్యౌషధం..

పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్

పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు తొలగిపోయి దంతలు శుభ్రపడతాయి. దంతాలు శుభ్రంగా మెరిసిపోతాయి. 
 
అలాగే బేకింగ్‌ సోడాను పడుకునే ముందు టూత్‌ పేస్టుపై చిటికెడు చల్లి బ్రష్‌ చేయాలి. ఇలా బ్రష్‌ చేయడం వల్ల పళ్ళపై ఏర్పడిన మచ్చలు తొలగుతాయి. బేకింగ్‌ సోడా పళ్ళపై పేరుకున్న బ్యాక్టీరియాను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తుంది.