వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను?

వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే.. ద్రవాహారంపై అధిక శ్రద్ధపెట్టాలి. వేసవికాలంలో పోషకాహారంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ద్రవాహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో మజ్జిగ

మంగళవారం, 7 మార్చి 2017 (14:20 IST)
వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే.. ద్రవాహారంపై అధిక శ్రద్ధపెట్టాలి. వేసవికాలంలో పోషకాహారంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ద్రవాహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో మజ్జిగ కూడా ఒకటి. వేసవిలో రోజూ తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేసి... దగ్గును, జలుబును నివారిస్తుంది. 
 
అలాగే పుదీనాను ఎండాకాలంలో తప్పక తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు. పుదీనాతో మంచి ఫ్లేవరబుల్‌ చట్నీలు చేసుకోవచ్చు. ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్‌‌గా సహాయపడుతుంది. పుచ్చకాయను వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ పుచ్చకాయ. వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది. నిమ్మకాయను శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి సహాయపడుతుంది.
 
కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమవుతాయి. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది. ఇకపోతే.. జామకాయలో విటమిన్‌ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments