శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:06 IST)

చిలకడదుంపలు తింటే కలిగే మేలు ఏమిటి?

చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగ

చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. చిలకడదుంప పొటాషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇది హృదయ స్పందన మరియు నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిరులను పొటాషియం తగ్గిస్తుంది.
 
కడుపు (జీర్ణాశయంలో) ఏర్పరిచే అల్సర్‌లను తగ్గించి వేస్తాయి. ఫైబర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్న, ఈ పిండి పదార్థాలతో కూడిన ఆహారం, అసిడిటీ సమస్యలను మరియు మలబద్దకం వంటి వాటిని కలుగకుండా చూస్తాయి. విటమిన్ 'ఎ', యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేయటమే కాకుండా ఈ దుంపలలోని అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదాల నుండి, మరియు వీటి వలన ప్రమాదానికి గురైన కణాలను భర్తీ చేయటానికి ఈ విటమిన్ సహాయపడుతుంది. 
 
చిలకడ దుంప, శరీర రక్తంలో తెల్ల రక్తకణాలను మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చిలకడ దుంప, విటమిన్ 'డి'ని పుష్కలంగా కలిగి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరచి, మానసిక కల్లోలాలను తగ్గించి, శక్తిని పెంచి, ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండె కండరాలు బలంగా ఉండేలా నిర్మిస్తుంది. చిలకడదుంప పుష్కలమైన విటమిన్ 'సి' కలిగి ఉండి, జలుబు మరియు ఫ్లూలను తగ్గించటమే కాకుండా, దంతాలు, ఎముకల ఏర్పాటు, రక్త కణాల మరియు కొల్లజన్ ఉత్పత్తిలను పెంచుతుంది. కొల్లాజన్ చర్మ కణాలకు స్టితిస్థాపకతను చేకూర్చి ఒత్తిడి మరియు క్యాన్సర్ వ్యాధిని కలుగచేసే కారకాల చర్యలను అడ్డుకుంటుంది.