ఆరోగ్య చింతలను తీర్చే చింత చిగురు... తింటే మీకే తెలుస్తుంది...

సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్,

శుక్రవారం, 17 జూన్ 2016 (20:36 IST)
సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 
 
కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 
 
తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

అన్నీ చూడండి

అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన మహిళ.. చేతులు, కాళ్లను తాడుతో కట్టేసి...?

నీట్-యూజీ 2026: జూన్ 21న మళ్లీ పరీక్ష.. ఎన్టీఏ ప్రకటన

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments