బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (14:03 IST)

పసుపుతో చుండ్రుకు చెక్ పెట్టొచ్చా? ఇదిగోండి హెయిర్ ప్యాక్!

వంటింట్లో నిత్యం వాడుకల్లో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. కూరలో రుచికోసం, ఆడవారి అందానికి, గాయాలకు ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు ఒక అద్భుతమైన ఔషదం, అంతేకాదు

వంటింట్లో నిత్యం వాడుకల్లో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. కూరలో రుచికోసం, ఆడవారి అందానికి, గాయాలకు ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు ఒక అద్భుతమైన ఔషదం, అంతేకాదు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ముఖచర్మంపై అవాంఛిత రోమాలను కూడా తొలగించేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా, పసుపు వలన జుట్టుకు వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? పొడవైన జుట్టు అందించుటలో పసుపు ఏ విధంగా మనకు సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం...
 
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగిన పసుపు చుండ్రును నివారిస్తుంది. పసుపులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ పోసి పేస్ట్‌లా చేసి తలపై చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాలు ఉంచి తరువాత గోరువెచ్చని  నీటితో జుట్టును కడిగి వేయాలి.  ఇలా చేయడం వల్ల తలపై చర్మంలో రక్త ప్రసరణ పెంచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు నిగనిగలాడాలంటే పసుపు కలిపిన హెన్న ప్యాక్‌ను జుట్టుకు పట్టించి 1 గంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. పసుపును రోజ్ వాటర్‌లో కలిపి ముఖానికి, శరీరానికి కలిపి మర్ధనా చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.