1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2015 (17:57 IST)

ఆవేశపడావద్దు.. బరువు పెరగావద్దు..!

ఆవేశపడావద్దు.. బరువు పెరగావద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు పెరగడానికి ఆవేశమే ప్రధాన కారణమని తేలింది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో అత్యంత జాగరూకతతో, సహనంతో ఉండేవారి బరువులో పెద్ద మార్పులేవీ కనిపించలేదని పరిశోధకులు వెల్లడించారు. 
 
వ్యక్తిత్వ విలక్షణతకు అధిక బరువుకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి మొత్తం 1,988 మందిపై చేసిన పరిశోధనలో వ్యక్తుల వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరగడానికి వారిలో ఉండే ఆవేశమే కారణమని తేల్చారు. వ్యక్తి వయస్సుతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే ఆవేశం తగ్గించుకుని, సమతుల్య ఆహారం తీసుకుంటూ రోజులో కొంత సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.