suvichar
✕

రావిచెట్టు బెరడుతో శ్వాసకోశ సమస్యలకు చెక్

Written By సిహెచ్
Updated: గురువారం, 6 మే 2021 (22:20 IST)
రావిచెట్టు అనే పెద్ద సతత హరిత వృక్షం భారతదేశంలో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది ఆక్సిజన్‌ను విడుదల చేయడమే కాకుండా చాలా ముఖ్యమైన ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు, మలబద్ధకం మరియు ఉబ్బసం వంటి సమస్యలను అడ్డుకునేందుకు రావిచెట్టు యొక్క వివిధ భాగాలైన వేర్లు, బెరడు, కాండం బెరడు, మూలాలు, ఆకులు మరియు పండ్లు ఉపయోగించబడతాయి.
 
చర్మ వ్యాధుల నివారించేందుకు రావిచెట్టు ఉపయోగపడుతుంది. లేపనం రూపంలో రావి ఆకు సారాన్ని గాయంపై రాస్తే గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా తామరకు సంబంధించిన మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 
 
రావి బెరడు శ్లేష్మ కణాలు లేదా ఇతర శరీర కణజాలాలను సంకోచించడం ద్వారా విరేచనాల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రావి బెరడు యొక్క ఎండిన పొడిని దాని అలెర్జీ నిరోధకశక్తి కారణంగా శ్వాసకోశ సమస్యలను అడ్డుకోవడంలో ఉపయోగిస్తారు. పొడి రావి ఆకుల నుండి తయారైన మాత్రలు మలబద్దకాన్ని అడ్డుకోవడానికి ఉపయోగించవచ్చు. రావి కొంతమంది హైపర్సెన్సిటివ్ వ్యక్తులలో అలెర్జీకి కారణం కావచ్చు, కాబట్టి వైద్య పర్యవేక్షణలో మాత్రమే రావి చెట్టు మూలికలను ఉపయోగించడం మంచిది

అన్నీ చూడండి

స్తంభించిన మైక్రోసాఫ్ట్‌ సేవలు - స్పందించిన టెక్ దిగ్గజం

దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌

మహిళా కూలీపై అత్యాచారం... ఆటో-రిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు

తండ్రి ఆస్తిలో కొడుకుకి జన్మహక్కు కింద వాటా లేదా? సుప్రీంకోర్టు ఏం చెబుతోంది...?

బహిరంగంగా ప్రేమను వ్యక్తం చేసినందుకు మహిళకు కొరఢా దెబ్బలు

అన్నీ చూడండి

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments