శ్రీ పంచమి సరస్వతీ జన్మదినం.... బుధవారం పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది

చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి. దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ

Written By chj
Updated: మంగళవారం, 31 జనవరి 2017 (22:43 IST)
చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతి జన్మదినం మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి. దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది.
 
శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. మాఘ శుక్ల పంచమి నాడు, విద్యారంభం నాడు ప్రాతఃకాలాన సరస్వతిని అర్చించాలి. తొలుత గణపతిని పూజించి, అటుపై శారదాంబా ప్రతిమను, పుస్తకాలను, లేఖినిని ఆరాధించాలి. షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి. 
 
తల్లికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, శుక్లవస్త్రాలతో అర్చించాలి. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న... తదితర పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్యని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఈ రోజున బాసర( వాసర) క్షేత్రంలో అమ్మవారి ఆవిర్భావాన్ని మహోత్సవంతో జరుపుతారు.
 
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా
సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!!

అన్నీ చూడండి

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

అన్నీ చూడండి

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

Daily Astrology: 24-07-2026 శుక్రవారం ఫలితాలు.. ఒత్తిడికి గురికావద్దు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తర్వాతి కథనం
Show comments