శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (16:51 IST)

ఆరోసారి పెళ్లి చేసుకున్న ప్లేబాయ్ మోడల్ పమేలా!! (video)

బ్రిటీష్ మాజీ నటి, ప్లేబాయ్ మోడల్ పమేలా ఆండర్సన్ మరోమారు పెళ్లికూతురైంది. తనకు బాడీగార్డుగా ఉన్న డాన్ హేరస్ట్‌ను పెళ్లాడింది. ఇది ఆమెకు ఆరో పెళ్లి. వీరిద్దరి వివాహం క్రిస్మస్ పర్వదినమైన గత యేడాది డిసెంబరు 25వ తేదీన జరిగింది. 
 
పమేలా వివాహ చరిత్రను ఓ సారి పరిశీలిస్తే, ఈమె తొలుత 1995లో టామీ లీని అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అతనితో కలిసి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. ఆ తర్వాత 1998లో వారిద్దరూ విడిపోయారు. 
 
ఈ క్రమంలో 2006లో సింగర్‌ కిడ్‌ రాక్‌ను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరూ అదే యేడాది విడిపోయారు. ఇక 2007లో రిక్‌ సాల్మన్‌ను పెండ్లాడిన పమేలా మరుసటి సంవత్సరమే ఆయనకు విడాకులిచ్చారు. 
 
2014లో వారిద్దరూ మరోసారి పెండ్లి చేసుకోని మరుసటి ఏడాదే మరో దారి చూసుకున్నారు. ఇక 2020లో పమేలా జాన్‌ పీటర్స్‌ను పెండ్లాడి 12 రోజులకే ఆయనతో విడిపోయారు. అంతేకాకుండా, వికీలీక్స్‌ ఫౌండర్‌ జులియన్‌ అసాంజేతోనూ పమేలాకు సంబంధాలున్నాయనే ప్రచారం కూడా ఉంది.