Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడు నా భార్యను అనరాని మాటలన్నాడు... విల్ స్మిత్

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 29 మార్చి 2022 (14:10 IST)
హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందుతున్నట్టు చెప్పాడు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ రాక్ కామెంట్ చేశారు. దీంతో క్రిస్‌ను విల్ స్మిత్ చెంపఛెళ్లుమనిపించారు. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్‌పై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఆస్కార్ కమిటీ కూడా విల్ స్మిత్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. 
 
దీంతో విల్ స్మిత్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాజాగా కూడా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మరోమారు క్షమాపణలు కోరారు. తన భార్య అనారోగ్య పరిస్థితిపై ఆయన అనవసర జోకులు పేల్చారని, అందుకే కోపం వచ్చి ఆయన్ను చెంపపై కొట్టినట్టు చెప్పారు. 
 
"నేను చేసింది ముమ్మాటికీ తప్పే. అందుకు క్రిస్‌కు క్షమాపణలు చెప్పుకుంటున్నా. దారి తప్పి ప్రవర్తించాను. నా చర్యకు, ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా. నేను చేసిన పనికి నన్ను తప్పుగా అనుకోవద్ద" అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. హింస ఏ రూపంలో ఉన్నప్పటికీ అధి విషమేనని, దాన్ని ఎవరూ ప్రోత్సహించరాదని చెప్పారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో తన ప్రవర్తన ఏమాత్రం క్షమించరానిదని ఆయన గుర్తుచేశారు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments