మోడీ కి సుధాచంద్రన్ విన్నపం - క్షమాపణ చెప్పిన సీఎస్ఎఫ్.
నర్తకి, నటి, సీనియర్ సిటిజన్ అయిన సుధాచంద్రన్‌కు ప్రతిసారి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదరవుతోంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చినా విమానాశ్రమంలో ప్రతిసారీ తన కృత్రిమ కాలును తీసి చూపించాల్సిందిగా సీఐఎస్ఎఫ్.కు చెందిన మహిళా అధికారులు అడుగుతున్నారు. అది వీలుకాదంటే ఆమెను చాలాసేపు అక్కడే కూర్చోబెట్టి ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఈ విషయమై ఇటీవలే ఆమె కేంద్ర ప్రభుత్వానికి మోడీకి, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
నా పేరు సుధాచంద్రన్. నేను నర్తకిని. నటిని కూడా నేను చేసిన సినిమా వల్ల దేశమంతా ఎంతో పేరు వచ్చింది. కేంద్రప్రభుత్వం కూడా గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. కానీ ప్రతిసారీ నన్ను విమానాశ్రమంలో సీఐఎస్ఎఫ్.కు చెందిన మహిళా అధికారులు నా కృత్రిమకాలు తీసి చూపించమంటున్నారు. నేను ఏమీ చెప్పినా వినిపించుకోవడంలేదు. ఒక మహిళకు మరో మహిళ ఇచ్చే గౌరవం ఇదేనా! అంటూ విజ్ఞప్తి చేసింది.
మామూలుగా దేశీయ భ్రదత దృష్ట్యా ఇలాంటివారు వుంటే కాలుకు కట్టిన కట్టును కూడా తీసి చూపించాల్సి వుంటుంది. కానీ నేను దేశమంతా ఎలాంటి మహిళనో తెలుసు. కనుక నా విన్నపాన్ని స్వీకరించి సెపరేట్ ఐడీని ఇవ్వాల్సిందిగా సుదా కోరింది.
ఇందుకు స్పందించిన సిఐఎస్ఎఫ్. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రొటోకాల్ ప్రకారం అసాధరణ స్థితిలో మాత్రమే ప్రోస్తెటిక్స్ తొలగించాలని మాత్రమే సూచించాలి. అయితే మిమ్మిల్ని అలా అడిగిన మహిళా అధికారిని ఎందుకు అలా అడిగిందో తెలుసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని పేర్కొంది.