గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: బుధవారం, 22 జూన్ 2016 (16:15 IST)

నేరేడు పండ్ల సీజన్... నేరేడుతో ఏమేమి తగ్గుతాయో తెలుసా...?

నగరంలో ఉండేవారికి నేరేడు పళ్ల గురించి అంతగా తెలియదు. కొన్నిచోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూ వుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడు పండు తినగానే నోరంతా అదో మా

నగరంలో ఉండేవారికి నేరేడు పళ్ల గురించి అంతగా తెలియదు. కొన్నిచోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూ వుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడు పండు తినగానే నోరంతా అదో మాదిరిగా కొట్టుకుపోయినట్లు ఉండి... వగరు వగరుగా ఉండటంతో చిన్నపిల్లలు అస్సలే దగ్గరికి రానీయరు. కానీ నేరేడును ఆయుర్వేద శాస్త్రంలో అపర సంజీవిని అంటారు. జీర్ణ సంబంధిత రోగాలకు నేరేడు దివ్యౌషధం. నేరేడు పండ్లను గింజలతో సహా జ్యూస్‌ చేసుకుని సేవిస్తే కడుపులో నులిపురుగులు వెంటనే చనిపోతాయి.
 
జీర్ణశక్తిని అమాంతం పెంచేస్తుంది ఈ నేరేడు జ్యూస్‌. తరచుగా కడుపునొప్పితో బాధపడేవారికి ఈ జ్యూస్‌ వారం రోజులపాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలలో బాధపడేవారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి. చిన్నపిల్లలకు నేరేడు లాభాలను గురించి చెప్పాలి. వగరుగా ఉండటమే దాని ప్రత్యేకత అని దానిని తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని వారికి అర్థం అయ్యేరీతిలో చెబుతుండాలి.
 
విషాన్ని హరించే శక్తి...
అడవి ప్రాంతాలలో ఈ నేరేడు పండ్లు విరగగాసేవి. మొదట్లో వీటిని పిచ్చికాయలుగా భావించి జనం తీసుకునేవారు కాదట. అయితే ఇందులో ఎంతో ఔషధ గుణాలున్నాయని తెలుసుకుని, అపర సంజీవనిలా ఇది పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి జనం వీటిని మందులాగా వాడుతున్నారు. పూర్వకాలంలో ఏదైనా విష పురుగులు శరీరంలో ఎక్కడైనా కుట్టినట్లయితే... వెంటనే నేరేడు ఆకులను ఆ ప్రాంతంలో వేసి కట్టుకట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లవారేసరికి రోగి లేచి కూర్చునేవాడట. అంటే మన శరీరంలో విషాన్ని కూడా పీల్చేసే శక్తివంతమైన ఆకులు కలిగివున్న నేరేడు చెట్టు... తన కాయల ద్వారా కూడా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించడం విశేషం. 
 
గింజల్లోనూ విశేషమే...
నేరేడు గింజల్లో జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌ పదార్థం ఉంది. ఇది మన శరీరంలో ఉండే స్టార్చ్‌ను చక్కెరగా మారుస్తుంది. అది ఉత్పత్తి చేసే చక్కెర షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక రకంగా మన శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను ప్రకృతిసిద్ధంగా ఇది మనకు అందిస్తోంది. 
 
అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే వెంట్రుకలు మన కడుపులోకి పంపించేస్తుంటాం. అయితే ఆ వెంట్రుకలు కడుపులో చుట్టుకుపోయి అప్పుడప్పుడు ఇబ్బందిని కలిగిస్తుంటాయి. నేరేడు పండ్లు ఆ వెంట్రుకలను బయటకు పంపించేస్తాయట. అందుకే నేరేడు పండ్లు విరివిగా దొరికే సీజల్‌లో అయినా నేరేడు పండ్లను తినాలి. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడు పండ్లను తినాలని పెద్దలు చెబుతుంటారు.