మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (14:24 IST)

పుదీనా ఆకుల వాసనతో మూర్ఛకు ఉపశమనం

చాలామంది మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఎక్కడంటే అక్కడ పడిపోతుంటారు. దీంతో ఇలాంటి వారి చేతిలో ఓ ఇనుప ముక్కను ఉంచుతారు. చిన్నపిల్లలకైతే మొలతాడుకి ఈ ముక్కను కడుతారు.

చాలామంది మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఎక్కడంటే అక్కడ పడిపోతుంటారు. దీంతో ఇలాంటి వారి చేతిలో ఓ ఇనుప ముక్కను ఉంచుతారు. చిన్నపిల్లలకైతే మొలతాడుకి ఈ ముక్కను కడుతారు. అయితే, మూర్ఛ వచ్చిన వారికి పుదీనా ఆకుల వాసన చూపిస్తే  తక్షణ ఉపశమనం కలుగుతుందని గృహవైద్యులు చెపుతున్నారు.
 
అంతేనా, వ్యక్తి ఉన్నట్టుండి మూర్ఛపోతే పుదీనా ఆకులను అరచేతిలో వేసుకుని నలిమి మూర్ఛపోయిన వ్యక్తికి వాసన చూపిస్తే మూర్ఛ దూరమై తక్షణ ఉపశమనం కలుగుతుంది. జలుబు కారణంగా వచ్చిన జ్వరంతో బాధపడేవారికి పుదీనా, సొంఠి రసాన్ని కలిపి సేవిస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
ఇకపోతే, అతిసార వ్యాధితో బాధపడుతుంటే పుదీనా ఆకులను రుబ్బి తేనెతో కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆజీర్తితో బాధపడుతుంటే పుదీనా రసాన్ని సేవిస్తే జీర్ణం బాగా అయ్యి ఆకలి వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు సలహా ఇస్తున్నారు.