శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (13:34 IST)

నోటి దుర్వాసనను అడ్డుకునేదుకు దానిమ్మ తీసుకుంటే?

దానిమ్మగింజల రసాన్ని రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలను నివారించడ

దానిమ్మ గింజల రసాన్ని రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యత సమస్యలను నివారించడంలో ముఖ్య మాత్రవహిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంపొందిచడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.
 
ఈ గింజలు రక్తసరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్కులోపలి భాగాన్ని నెమ్మదిగా నములుతూ ఆ రసాన్ని మింగితే విరేచనాలు దూరమవుతాయి. ఉదర సమస్యలకు, అజీర్తికి ఇది బాగా పనిచేస్తుంది. దానిమ్మ పండును నీటిలో నానబెట్టి తేనెలో కలుపుకుని తీసుకుంటే కడుపులో మంటను తగ్గించుటకు సహాయపడుతుంది.
 
పళ్ళపై ఉండే పాచి తొలగిపోవాలంటే దానిమ్మతో రుద్దుకుంటే మంచిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంతో పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడేందుకు దానిమ్మను తీసుకుంటే రక్త పరిమాణం పెంచుతుంది.

స్మార్ట్‌గా ఆక్టివ్‌గా ఉండాలంచే దానిమ్మ జ్యూస్ తీసుకుంటే మంచిది. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.