మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: సోమవారం, 17 ఏప్రియల్ 2017 (22:02 IST)

కాకర కాయ రసం తీసుకునే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలా తీసుకోవాలంటే...

షుగర్ వ్యాధి అనగానే ఏది తినాలన్నా భయమేస్తుంది. అందుకనే వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకనే వైద్యులు పత్యం పాటించాలని చెపుతుంటారు. ఆయుర్వేదంలో కూడా షుగర్ వ్యాధిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ప్రతి రో

షుగర్ వ్యాధి అనగానే ఏది తినాలన్నా భయమేస్తుంది. అందుకనే వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకనే వైద్యులు పత్యం పాటించాలని చెపుతుంటారు. ఆయుర్వేదంలో కూడా షుగర్ వ్యాధిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. కాకర రసం చేదుగానే ఉంటుంది. కాకర కాయను తినడానికే కాసింత చక్కెర వేసి మరీ తింటుంటారు. అందునా కాకర రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మధుమేహానికి మందుగా కాకర రసం సూచించడం వరకు బాగానే ఉంటుంది.
 
ఐతే కాకర రసం పడని వారికి వాంతులైతే మరికొందరికి విరేచనాలు అవుతాయి. అందువల్ల కాకరకాయ రసం కొద్దికొద్దిగా తాగాల్సి ఉంటుంది. ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి-రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టాలి. 
 
ఆ తర్వాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకర రసాన్ని త్రాగడమే మేలని మధుమేహంతో బాధపడేవారు అనుకుంటారు. దీంతో మధుమేహం బై చెప్పేసి పారిపోతుంది అంటున్నారు వైద్యులు.