1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (15:38 IST)

ఖర్జూరం.. పాలు.. నెయ్యి కలిపి తీసుకుంటే...

సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్‌‌ మాసం వచ్చిందంటే చాలు, పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్షను పూర్తి అవుతుంది.

సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్‌‌ మాసం వచ్చిందంటే చాలు, పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్షను పూర్తి అవుతుంది. అందుకే వారికిదిలేనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. ఖర్జూరంలో ఎన్నో పోషక పదార్థాలు, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఖర్జూర పండ్లలో గ్లూకోజ్, ప్రక్టోజ్ వంటి ప్రకృతి సిద్ధమైన చక్కెర పదార్థాలు ఉంటాయి. ఈ పండును రోజూ ఒకటి చొప్పున తీసుకున్నట్టయితే రోగ నిరోధక శక్తి పెరిగి.. ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండు సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, యుఏఈ, ఒమన్‌, ట్యునీషియా, జోర్డాన్‌ల నుంచి ప్రతి యేటా టన్నులు టన్నులుగా దిగుమతి చేసుకుంటారు. 
 
అయితే, ఈ పండ్లలో విటమిన్ ఏ, బిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయి. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఖర్జూర పండు శరీరంలో అధికంగా గల వాతాన్ని పోగొడుతుంది. ఉదయాన్నే మలబద్దకముతో బాధపడే వారు, రాత్రి పాలల్లో 4 నుండి 5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి, రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంటే మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 
 
ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు... ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే రక్త శాతం పెరుగుతుంది. పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందవచ్చు. అలాగే, నీరసం, నిస్సత్తువతో బాధపడుతున్నవారు, కొన్ని నెలల పాటూ రోజుకు ఐదు నుంచి పది చొప్పున ఖర్జూర పండ్లు భోజనం తర్వాత ఆరగించినట్టయితే మంచి బలవంతులుగా తయారవుతారు. 
 
ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, ఖర్జూర పండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ బారినపడకుండా ఉండొచ్చు. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా ఆరగించాలి.