శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (12:42 IST)

శీతాకాలం... వాటర్ థెరఫీ... ఏం చేయాలంటే?

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులకు కాచిన నీరు ఎక్కువగా త్రాగడం, ఆవిరిపీల్చడం వలన స్వస్థత చేకూరుతుంది. బెణుకులు, వాపులకు, వేడినీటి కాపడం పెట్టడం వలన ఈ సమస్యలు తగ్గుతాయి. ముక్కులు బిగిసినప్పుడు ఉప్పునీటిని ముక్కుతో పీల్చాలి. గొంతునొప్పికి, వేడినీటిలో ఉప్పు కలిపి గొంతులో పోసుకుని పుక్కిలించడం వలన బాధ తగ్గుతుంది.
 
మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు, ఉదయం లేవగానే నీరు త్రాగిన బాధ తగ్గుతుంది. దురదలు, మంటలు ఏర్పడినప్పుడు చన్నీటి కాపడం పెట్టనా ఉపశమనం కలుగుతుంది. కాచిన నీరు త్రాగుతూ, శరీర అవయవాలు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చును. జ్వర తీవ్రత ఎక్కువగానున్న ఎడల, చల్లని నీటిలో శుభ్రమైన గుడ్డను తడిపి నుదుటిమీద ఉంచిన జ్వరం తగ్గుతుంది.
 
నీరు సరిపడినంత ప్రతిదినమూ త్రాగుచున్నవారికి సామాన్యమైన మూత్రాశయ వ్యాధినుండి, మూత్ర విసర్జనలో దురదలు, మంటల నుండి ఉపశమనం పొందగలరు. బార్లీ నీరు త్రాగడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 
 
జీవనాధారమైన నీటిలో ఈనాడు కాలుష్యం ఎక్కువై అనేక వ్యాధులకు కారణమవుతుంది. కొన్ని ప్రాంతాలలో నీటివలన ఫ్లోరిసిన్ వ్యాధి ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి తాగేనీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఆరోగ్యశాఖవారి సలహాననుసరించి వివిధ ప్రక్రియల ద్వారా నీటి కాలుష్యాన్ని తొలగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.