Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాల్చిన చెక్కతో చర్మవ్యాధులకు చెక్ పెట్టండి

Written By chitra
Updated: సోమవారం, 11 జనవరి 2016 (09:04 IST)
మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే దాల్చిన చెక్క మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె జబ్బు తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
 
తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులులాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలు ఇబ్బందిపడే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు.
 
దాల్చిన చెక్కను మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబు వల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.  
 
10 గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్ వేడి నీటిలో 2 గంటలపాటు ఉంచి ఆపై దాన్నివడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు. మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి. 

అన్నీ చూడండి

పసిబిడ్డతో అసెంబ్లీకి వచ్చిన టీవీకే ఎమ్మెల్యే పల్లవి.. ఓవరాక్షన్ అంటూ ట్రోల్స్..

మరణశయ్యపై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?!!: పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశం

వల్లభనేని వంశీని జగన్ పక్కనబెడుతున్నారా? ఏంటి సంగతి?

శభాష్ ఝార్ఖండ్ స్టూడెంట్స్, ఎవరినీ అవమానించకుండా సాధించారు: కంగనా రనౌత్

పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంని చేయడమే లక్ష్యం: కుండబద్ధలు కొట్టిన పంతం నానాజీ

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

Show comments