గురువారం, 10 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 జూన్ 2018 (09:18 IST)

కొవ్వును కరిగించే వంటింటి చిట్కాలు...

చాలామందికి పొట్టకింది భాగంలోనూ, శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుని పోయివుంటుంది. దీనివల్ల గుండెపోట్లు వస్తున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కరిగించేందుకు వివిధ రకాల వ్యాయామాలతోపా

చాలామందికి పొట్టకింది భాగంలోనూ, శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుని పోయివుంటుంది. దీనివల్ల గుండెపోట్లు వస్తున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కరిగించేందుకు వివిధ రకాల వ్యాయామాలతోపాటు పలు డైటింగ్ టిప్స్‌ను కూడా పాటిస్తుంటారు. అయితే, ఇలా పేరుకునిపోయిన కొవ్వును చిన్నపాటి చిట్కాలతో ఇంటివద్దే తగ్గించుకోవచ్చు. అలాంటి చిట్కాలేంటో తెలుసుకుందాం.
 
1). రోజుకు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినడం వల్ల కొవ్వును నెమ్మదిగా కరిగించుకోవచ్చు. 
2). నూనెలో వేయించే పూరిల కన్నా నూనెలేకుండా చేసే పుల్కాలే ఆరోగ్యానికి మంచివి. 
3). గుడ్లు, పచ్చళ్లు, అప్పడాలు, స్వీట్లు, కేకులు, ఫిజ్జాలు, చాక్లెట్లు.. చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. 
4). కొవ్వు తీసేసిన పాలు తాగడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగకుండా నియంత్రించవచ్చు. 
5). డాల్డాతో తయారు చేసే వంటకాలకు దూరంగా ఉండటం. 
6). కూరలను వేడిమీద ఉన్నసమయంలోనే ఆరగించడం ఆరోగ్యకరం. 
7). కూరలలో నూనెవాడకం వీలైనంత తగ్గించాలి. 
8). నూనెలో వేయించే బజ్జీల వంటి పిండివంటలకు దూరంగా ఉండాలి. 
9). జీడిపప్పు, వేరుశనగ వంటివి ఎక్కువగా తినకుండా కాయగూరలు, పండ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. 
10). తృణధాన్యాలు, పప్పు ధాన్యాలను వీలైనంత మేరకు పరిమితంగా తీసుకోవడం మంచిది.