శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 24 మే 2018 (19:35 IST)

ఆ తండ్రికి 71 ఏళ్లు... నిద్రిస్తున్న 25 ఏళ్ల కుమార్తెను ఆక్రమించబోయాడు...

ఈమధ్య కాలంలో అమ్మాయిలు కన్నతండ్రిని కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి తలెత్తుతోంది. కామాంధులు తమ రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని కూడా వదలడంలేదు. ఇప్పటికే ఇలాంటి కేసులు వెలుగుచూస్తూనే వున్నాయి. ఇటీవలే ఎంఎ చదువుతున్న కుమార్తెపై అత్యాచారం చేసే

ఈమధ్య కాలంలో అమ్మాయిలు కన్నతండ్రిని కూడా అనుమానించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి తలెత్తుతోంది. కామాంధులు తమ రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని కూడా వదలడంలేదు. ఇప్పటికే ఇలాంటి కేసులు వెలుగుచూస్తూనే వున్నాయి. ఇటీవలే ఎంఎ చదువుతున్న కుమార్తెపై అత్యాచారం చేసేందుకు తెగబడ్డాడు 71 ఏళ్ల తండ్రి. తన కుమార్తెకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టాల్సిన తండ్రే యవ్వనంలో వున్న కుమార్తెను కాటేయబోయాడు. చివరికి ఆమె చేతిలోనే ఖతమయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే... అస్సోం రాష్ట్రంలోని బిస్వనాథ్ జిల్లాలో 71 ఏళ్ల వృద్ధుడు తన కుమార్తె అనే విచక్షణ సైతం మరిచి కామ పిశాచిగా మారి అతడి 25 ఏళ్ల కుమార్తె పైనే కన్నేశాడు. అర్థరాత్రి నిద్రిస్తున్న కుమార్తె వద్దకెళ్లి ఆమెను ఆక్రమించబోయాడు. ఈ హఠత్పరిణామానికి భీతిల్లిపోయిన ఆమె అతడికి ఎదురుతిరిగింది. ఐనా వదల్లేదు ఆ వృద్ధుడు. ఆమెను అత్యాచారం చేసేందుకు అతడు ఆంబోతులా మీదకొచ్చాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఇంట్లో మూలనున్న గొడ్డలిని తీసుకువచ్చి మాట వినకుంటే చంపేస్తానంటూ గొడ్డలి ఎత్తాడు. 
 
ఐతే అదే గొడ్డలని అతడి నుంచి లాగేసి ఆమె తన తండ్రిని నరికింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇదంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. విషయం తెలిసిన ఆమె సోదరసోదరిలు తండ్రి హత్య గురించి బయటకు వస్తే తన చెల్లి జైలుపాలవుతుందని దాచి పెట్టారు. వీరికి వారి తల్లి కూడా సహకరించింది. దాంతో అంతా కలిసి ఆ మృతదేహాన్ని ఇంటి వెనుక 15 అడుగుల గోయి తవ్వి పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసు స్టేషనుకు వెళ్లి తమ తండ్రి మిస్ అయ్యాడంటూ కేసు పెట్టారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంతగా గాలించినా ఫలితం కనబడలేదు. దాంతో వారి దృష్టిని కేసు పెట్టిన కుటుంబ సభ్యులపైకే మరల్చారు. చుట్టుప్రక్కల వారిని విచారించారు. కొన్ని రోజుల క్రితం ఇంటి వెనుక ఏదో గొయ్యి తవ్వి పని చేసినట్లు తాము గమనించామని కొందరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అంతే... గొయ్యి తవ్వితే డొంక కదిలింది. తనే తన తండ్రిని హత్య చేసినట్లు ఆ 25 ఏళ్ల యువతి అంగీకరించింది. తన తండ్రి తన పట్ల పశువులా ప్రవర్తించడంతో విధిలేక చంపేసినట్లు తెలిపింది. ఐతే అతడి హత్యకు కారణం అదేనా... లేదంటే ఆస్తి కోసం ఏమయినా చంపేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.