మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 మార్చి 2024 (20:57 IST)

తేనెతో ఇవి కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

bad cholesterol
కొలెస్ట్రాల్. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్ట్రాల్ తగ్గాలంటే అనుసరించాల్సిన మార్గాలు ఏమిటో తెలుసుకుందాము.
 
స్వచ్ఛమైన తేనెకి వెల్లుల్లిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
తేనెతో పాటు దాల్చిన చెక్క పొడిని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
తేనెలో ఉసిరి కాయలను నానబెట్టి తింటుంటే కొలెస్ట్రాల్ క్రమేణా కరిగిపోతుంది.
అవిసె గింజలు ప్రతిరోజూ కాసిన్ని తింటుంటే కొలెస్ట్రాల్ సమస్యను వదిలించుకోవచ్చు.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోను గ్రీన్ టీ సాయపడుతుంది.
ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి, ఇలా చేస్తే శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది.