శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (12:38 IST)

వర్షాకాలంలో ఇలా చేయండి.. నిద్రపోయే ముందు ఓ గ్లాస్ నీరుతాగితే...

సాధారణంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారినపడుతుంటారు. చీటికిమాటికి వర్షపు జల్లుల్లో తడవడం వల్ల, బయటి ప్రాంతాలతో పాటు.. ఇంటి ఆవరణమంతా చిత్తడిగా ఉండటం వల్ల అనారోగ్యంపాలవుతుంటారు.

సాధారణంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారినపడుతుంటారు. చీటికిమాటికి వర్షపు జల్లుల్లో తడవడం వల్ల, బయటి ప్రాంతాలతో పాటు.. ఇంటి ఆవరణమంతా చిత్తడిగా ఉండటం వల్ల అనారోగ్యంపాలవుతుంటారు. అయితే, ఇంట్లో చిన్నపాటి చిట్కాలను పాటిస్తే వర్షాకాలాన్ని కూడా ఎలాంటి అనారోగ్యాల బారినపడుకుండా వెళ్లదీయొచ్చని గృహ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
* ప్రతిరోజూ రాత్రి ముందు గోరువెచ్చని నీటిని ఓ గ్లాసు తాగడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిపూట గుండెపోటుతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఏర్పడవు. 
 
* గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లలో ఒక టీ స్పూన్ సోంపును వేసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని ఆ నీటిని వడకట్టి అందులో టీ స్పూన్ తేనే కలుపుని ఉదయం.. సాయంత్రం.. రాత్రి వేళల్లో తీసుకొంటే అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. 
 
* అదేవిధంగా, ఒక టీ స్పూన్ మిరియాల పొడి.. టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ప్రతిరోజు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.