మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:22 IST)

గుడ్డుసొనలో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

కోడిగుడ్డను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గుడ్డులోని పచ్చసొనలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చ

కోడిగుడ్డను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గుడ్డులోని పచ్చసొనలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా ఉంటుంది. మెుటిమలు కూడా తొలగిపోతాయి.
 
వెల్లుల్లి రెబ్బలను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గుడ్డు తెల్లసొనలో కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన మెుటిమలు నల్లటి వలయాలు తొలగిపోతాయి. గుడ్డు పచ్చసొనలో కొద్దిగా బాదం నూనె, వెన్న, పాలు, కర్పూరం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
గుడ్డుతెల్లసొనలో కొద్దిగా పాల మీగడ, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం అందంగా, కాంతివంతంగా మారడమే కాకుండా ముడతలు కూడా తొలగిపోతాయి. త్వదారా నల్లటి మచ్చలు, మెుటిమలు రాకుండా ఉంటాయి.