గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (16:29 IST)

గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తగ్గుతా

ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొనలో మజ్జిగను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తగ్గుతాయి. మోచుతులు అందంగా కనిపించాలంటే నిమ్మరసాన్ని లేదా ఉప్పును రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
ముఖం మీద గుంటలుంటే కమలాఫలం రసంలో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం అందంగా మారుతుంది. కనుగుడ్లు తెల్లగా ఉండాలంటే పండిన దోసకాయ గుజ్జును కంటి రెప్పలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కళ్ళు చల్లదనం పొంది ఎరుపు చారలు పోతాయి. 
 
కొబ్బరినూనెలో మరువం వేసి కాచి వడగట్టి ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పెదాలు నల్లగా ఉంటే బీట్‌రూట్ ముక్కలు పెదాలకు రుద్దుకుంటే నలుపుదనం తొలగిపోతుంది. మెడ నలుపుగా ఉంటే బొప్పాయిపండు గుజ్జును రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెడ తెల్లగా మారుతుంది.