బీట్‌రూట్ ఖీర్‌ను ఎలా తయారు చేస్తారు?

బుధవారం, 24 సెప్టెంబరు 2014 (15:39 IST)
తీసుకోవలసిన పదార్ధాలు: బీట్‌రూట్ - 1 (మీడియం సైజులో), పాలు - అర లీటరు, చక్కెర - ఒక కప్పు, ఆల్మండ్ ఎస్సెన్స్ - ఒక టేబుల్ స్పూను.
 
ఇలా తయారు చేయండి: ముందుగా బీట్ రూట్‌ను శుభ్రంగా కడుక్కొని దానిపై తొక్కను తొలగించాలి. అనంతరం బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణళి వేడెక్కాక బీట్‌రూట్ ముక్కలను వేసి.. అందులో సరిపడినంత పాలు పోయాలి.
 
ఈ మిశ్రమాన్ని ఎక్కువగా వేయించకుండా స్టౌమీద వేయించకూడదు. మిగిలిన పాలను స్టౌమీద బాగా కాగించాలి. ఇప్పుడు ఉడికించిన బీట్‌రూట్ ముక్కలను బాగా రుబ్బుకుని దానికి కాగిన పాలను జోడించాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాల పాటు స్టౌమీద పెట్టాలి. 
 
కాసేపటి తర్వాత కాగిన ఈ మిశ్రమానికి చక్కెర కలుపుకోవాలి. అనంతరం స్టౌమీద నుంచి దించేసి కాసేపు చల్లారిన తర్వాత అందులో ఆల్మండ్ ఎస్సెన్స్ కలుపుకోవాలి. దీంతో బీట్‌రూట్ ఖీర్ రెడీ. దీన్ని చల్లగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. 

అన్నీ చూడండి

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. మా కుటుంబం నుంచే మూడు ఓట్లు కూడా రావు : సల్మాన్

వేధింపులు భరించలేకే 'అమ్మ' కార్యదర్శి పదవికి రాజీనామా : అన్సిబా హాసన్

Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్

Venkatesh Iyer: అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిన క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్

Allu Arjun: అల్లు అర్జున్ శక్తిమాన్‌గా చేస్తున్నాడా?

Show comments