ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)
ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో ఎగురుతుండగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అమెరికా నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. మరుగు దొడ్ల సమస్య కారణంగా ఈ విమానం తిరుగు ప్రయాణం బాట పట్టింది. మరుగుదొడ్ల సమస్యను ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని ప్రశ్నించారు. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. మరుగు దొడ్ల సరిగా లేకపోతే ప్రయాణం ఎలా చేయాలని ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో చేసేది ఏమీలేక విమానాన్ని సిబ్బంది వెనక్కి మళ్లించింది.
విమానంలో 300 మందికి పైగా ప్రయాణీకులకు ఒకే ఒక టాయిలెట్ మిగిలి ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. విమానంలో వున్న 12 టాయిలెట్లలో 11 టాయిలెట్లు పని చేయకపోవడంతో ప్రయాణీకులు ఆందోళన చేరారు.
ఎయిర్ ఇండియా విమానం 216 అమెరికాలోని చికాగో నుంచి ఇండియాకు మార్చి 6న బయల్దేరింది. అయితే మరుగుదొడ్ల ఇబ్బంది కారణంగా ప్రయాణీకులు మండిపడటంతో.. దాదాపు ఐదు గంటలు గాల్లో తిరిగి.. చికాగో విమానాశ్రయానికి ఫ్లైట్ రావడానికి పది గంటలు పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.