ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (14:29 IST)

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 14మంది మృతి

నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. బస్సు లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తూర్పు నేపాల్‌లోని శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. 
 
దాదాపు 300 మీటర్ల లోతులో పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 14మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.