శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 9 మే 2019 (12:23 IST)

కాలింగ్ బెల్ కొడితే.. పామొచ్చి కాటేసింది.. వీడియో వైరల్

కాలింగ్ బెల్ కొట్టిన పాపానికి పాము కాటుకు గురయ్యాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వేరొకరి ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లగానే కాలింగ్ బెల్ నొక్కాడు. అంతే.. ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వెలుపలికి వచ్చిన పాము కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తి కంటికి పై భాగంలో కాటేసింది. 
 
అంతే ఆ వ్యక్తి లబోదిబోమంటూ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకా ఆ ఇంట్లోని వ్యక్తుల వద్ద తనను ఆస్పత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీసీటీవీ కెమెరాలో ఈ తతంగమంతా రికార్డు అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాము కాటుకు గురైన వ్యక్తి ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. 
 
కాలింగ్ బెల్ కొట్టిన వ్యక్తిని కరిచిన పామును కొట్టి చంపేశారని.. ఆ పాము విషపూరితమైనది కాదని వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి.