నా పెళ్లాం నన్ను చూసి ఆపకుండా వెకిలిగా నవ్వుతోంది... అందుకే చంపేశా...
ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు. కేవలం అతడిని చూసి ఆమె పెద్దగా నవ్వినందుకు రెచ్చిపోయిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... అమెరికాలో అలస్కా ప్రాంతంలో సరద
ఉన్మాదమా... క్రూరత్వమా... ఏదయితేనేం అతడు తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. ఎందుకో తెలిస్తే షాక్ తింటారు. కేవలం అతడిని చూసి ఆమె పెద్దగా నవ్వినందుకు రెచ్చిపోయిన భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... అమెరికాలో అలస్కా ప్రాంతంలో సరదాగా విహారయాత్రకు వెళ్లింది ఓ జంట.
కెన్నత్ మాంజరీస్, క్రిస్టీ భార్యాభర్తలు ఇద్దరూ హాయిగా విహారయాత్ర చేద్దామనుకుని అక్కడ ఓ పెద్ద ఓడ లో బసకు దిగారు. మొదటి రోజు ఎంతో ఆనందంగా సాగిపోయింది. ఐతే రెండో రోజు ఏమైందో తెలియదు కానీ వారు బస చేస్తున్న గదిలో క్రిస్టీ రక్తమడుగులో నిర్జీవంగా పడి వుంది.
దీనితో సిబ్బంది పోలీసులకు సమాచారాన్ని అందిచడంతో కెన్నెత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు హత్య చేశావని అడిగితే... నా భార్య నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్వింది. కొద్దిసేపు కాదు... చాలాసేపు... ఆ వెకిలినవ్వులను తట్టుకోలేకపోయా. అందుకే చంపేశానని చెప్పాడు. ఐతే అసలు కారణం వేరే ఏదయినా వుంటుందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.