గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (17:36 IST)

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Gopichand, Meenakshi Dinesh, BVSN Prasad, Kumar Sai
Gopichand, Meenakshi Dinesh, BVSN Prasad, Kumar Sai
గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ‘సాహసం’ తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం  అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత  సినిమాటోగ్రాఫర్ శామ్‌దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.
 
ఈ టీం బాక్సాఫీస్ వద్ద మరో సారి సంచలనాన్ని సృష్టిస్తుండటం ఖాయమనిపిస్తోంది. అద్భుతమైన కథనం, గోపీచంద్ యాక్షన్, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీ అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళ నటి మీనాక్షి దినేష్ ఈ థ్రిల్లర్‌లో గోపీచంద్ సరసన కథానాయికగా నటించనుంది.
 
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.