సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:57 IST)

గజగజ వణికిపోయిన అమెరికా.. చర్చలకు రావాలంటూ ఉ.కొరియాకు ఆహ్వానం

అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను

అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానించింది. 
 
ఉత్తర కొరియా సముద్ర జలాల్లో జపాన్, అమెరికాలు సైనిక విన్యాసాలు చేయాలని భావించాయి. ఇందుకోసం భారీ ఎత్తున యుద్ధనౌకలను అమెరికా తరలించింది. దీనిపై ఉత్తర కొరియాపై కన్నెర్రజేసింది. క్షిపణులతో దాడులు చేస్తామని సిద్ధమైంది. 
 
దీంతో ఓ మెట్టు దిగిన అమెరికా... చర్చలకు రావాలని ఉత్తర కొరియాను కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని, ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం చర్చిద్దామని కోరుతూ పెంటగాన్‌ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఇంటర్నేషనల్ ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సానుకూలత సాధించేందుకు ఉత్తర కొరియా ముందుకు రావాలని, అస్థిరతను పెంచే యత్నాలు కూడదని హితవు పలికింది. చట్ట విరుద్ధంగా క్షిపణులను పరీక్షించడం తమ దేశ భద్రతకు బెదిరింపుగా భావిస్తున్నామని, ఈ విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేయవద్దని సూచించింది.