'ది న్యూయార్క్ టైమ్స్' ఫోటో జర్నలిస్టును చంపేసిన రష్యా బలగాలు
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలు సామాన్య ప్రజలతో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులపట్ల కూడా ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయి. రష్యా బలగాలు జరిపిన దాడిలో 'ది న్యూయార్క్ టైమ్స్'కు చెందిన ఫోటో జర్నలిస్టును చంపేశాయి. రష్యా సేనలు చేసిన దాడిలో బ్రెంట్ రెనాడ్ (51) అనే ఫోటో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు.
రష్యా బలగాలు కాల్పులు జరిపిన సమయంలో రెనాడ్ తన సహచరులతో కలిసి ఓ ట్రక్కులో దాగివున్నాడు. ఉక్రెయిన్ శరణార్ధులు సరిహద్దులను దాటుతుండగా ఓ పాత్రికేయ బృందం ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నాయి. అపుడు రష్యా బలగాలు విచ్చలవిడిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో రెనాడ్ ప్రాణాలు కోల్పోయాడు.
రెనాడ్ మృతదేహంపై ఉన్న మీడియా బ్యాడ్జ్‌ను పరిశీలించిన అధికారులు అతడు 'ది న్యూయార్క్ టైమ్స్' ఫోటో జర్నలిస్టుగా గుర్తించారు. అయితే, దీనిపై న్యూయార్క్ టైమ్స్ వివరణ ఇచ్చింది. బ్రెంట్ రెనాడ్ గతంలో తమ సంస్థలో పనిచేశాడని, ప్రస్తుత అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నాడని, ఓ అసైన్మెంట్ కోసం ఉక్రెయిన్ వచ్చినట్టు తెలిసిందని తెలిపింది.