1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 జనవరి 2022 (17:31 IST)

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఐదుగురు ఉగ్రవాదుల హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం సాగుతోంది. ఇందులోభాగంగా శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నారు. 
 
ఈ ఎన్‌కౌంటర్ కాశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలోని చ్రార్ ఏ షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లు నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, ఈ ఘటనా స్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే 56 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు పెద్ద విజయమని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గడిచిన నెల రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.