Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

వాట్సాప్ యూజర్ల కోసం మరో అప్‌డేట్!

Written By ఎంజీ
Updated: బుధవారం, 3 నవంబరు 2021 (20:24 IST)
వాట్సాప్ యూజర్ల కోసం మరో మంచి అప్‌డేట్ సిద్ధమవుతోంది. అనుకోకుండానో, పొరపాటునో పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసేందుకు ప్రస్తుతం కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉంది.

ఆ సమయం దాటితే ఇక ఆ మెసేజ్‌ను డిలీట్ చేయడం సాధ్యం కాదు. అయితే, ఇకపై ఆ సమయ పరిమితిని వాట్సాప్ ఎత్తివేస్తోంది.

ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే గతంలో పంపిన పాత మెసేజ్‌లు, వీడియోలను కూడా డిలీట్ చేసుకునే వెసులుబాటు యూజర్లకు లభిస్తుంది.  

2017లో ‘డిలీట్ ఫర్ ఎవిరీవన్’ ఆప్షన్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఏడు నిమిషాల వ్యవధి మాత్రమే ఉండేది. అంటే పంపిన మెసేజ్‌లను ఆ సమయంలోపు డిలీట్ చేయాల్సి వచ్చేది. 2018లో ఈ సమయాన్ని 4,096 సెకన్లకు అంటే గంటా 8 నిమిషాల 16 సెకన్లకు పెంచింది.

అయితే, ఇప్పుడు దానిని కూడా తొలగించి, ఎప్పుడైనా డిలీట్ చేసుకునే వెసులుబాటును తీసుకొస్తోంది. ఫలితంగా కొన్ని నెలల తర్వాత కూడా పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు.
 
దీంతో పాటు స్టిక్కర్ సజెషన్ ఫీచర్‌పైనా పనిచేస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రమ్, ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి షేర్ అయ్యే వీడియోల కోసం వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను ఐవోఎస్ యూజర్లకు తీసుకొస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా ఐఓఎస్ యూజర్లు వీడియోను ఫుల్‌స్క్రీన్‌లో వీక్షించొచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌లోకి సులభంగా మూవ్ చేసుకునే వెసులుబాటు యూజర్లకు లభిస్తుంది. 

అన్నీ చూడండి

Rahul Vijay : అ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌ : రాహుల్‌ విజయ్‌

Nara Lokesh: రాయలసీమ నేపథ్యాన్ని రణబాలి ట్రైలర్ లో సహజంగా చూపారు : నారా లోకేష్

Prabhas vs Salman: మార్చి 2027లో పోరుకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఫౌజీ, సల్మాన్ మాన్‌స్టర్

Rajmouli Birthday: ప్రమాణాలు, కష్టపడేతత్త్వంతో ఎదిగిన ఎస్.ఎస్. రాజమౌళి కి ప్రముఖుల శుభాకాంక్షలు

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

తర్వాతి కథనం
Show comments