ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (18:07 IST)

పదేళ్ల బాలికను గర్భవతిని చేశాడు.. లావుగా ఉండటంతో 8 నెలల గర్భమని..?

మహిళలపై వావివరుసలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులు, బాలికలు అనే కనికరం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా అర్జెంటీనాలో 23 ఏళ్ల యువకుడి పాపంతో ఓ పదేళ్ల చిన్నారి గర్భం దాల్చింది.

మహిళలపై వావివరుసలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులు, బాలికలు అనే కనికరం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా అర్జెంటీనాలో 23 ఏళ్ల యువకుడి పాపంతో ఓ పదేళ్ల చిన్నారి గర్భం దాల్చింది. పదేళ్ల చిన్నారిపై 23 ఏళ్ల చిన్నారి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడటంతో..  బాలిక గర్భం ధరించింది. తాను గర్భం దాల్చిన విషయం అభంశుభం తెలియని ఆ చిన్నారికి 8 నెలల తర్వాతే తెలిసింది.
 
బాధితురాలు కడుపులో నొప్పిగా వుందని తల్లితో చెప్పింది. వెంటనే తన కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆ తల్లి.. వైద్యులు చెప్పిన విషయంతో షాక్ తింది. చిన్నారి 8 నెలల గర్భంతో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో బాధితురాలిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. బాలిక గర్భంగా ఉన్నట్లు ఇన్నాళ్లు గ్రహించలేకపోయిందని.. ఇంకా ఆ చిన్నారి లావుగా ఉండటంతో ఆమె 8 నెలల గర్భంగా వుందని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారని బాధితురాలి తల్లి వాపోయింది. 
 
ఈ కేసు విచారణలో చిన్నారి ఇంట్లో కొన్ని రోజుల క్రితం 23ఏళ్ల బంధువులబ్బాయి బస చేశాడని.. అతడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తేలింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.