బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (19:18 IST)

కరోనా వైరస్ ధాటికి 50వేల మంది మృతి?: చైనా నుంచి పరారైన పారిశ్రామిక వేత్త

కరోనా వైరస్ ద్వారా మరణించేవారి సంఖ్య 50వేలను దాటుతుందని ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చైనా వూహాన్ నగరం నుంచి వ్యాప్తి చెందిన ఈ కరోనా వైరస్‌కు ఆ దేశంలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్ ప్రభావంతో హడలెత్తిపోతున్నాయి. కరోనా భయంతో చైనాను ఇతర దేశాలకు చెందిన ప్రజలు వీడుతున్నారు. 
 
హాంకాంగ్ చైనా సరిహద్దులనే మూసివేసింది. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే 1011 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కరోనా వైరస్ ఇతర దేశాలు ఔషధ తయారీలో తలమునకలైనాయి. అయినా ప్రయోజనం లేదు. అంతేగాకుండా 20వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్‌కు చికిత్స చేయలేక చైనా వైద్య బృందాలు, సర్కారు నానా తంటాలు పడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో చైనా నుంచి పరారై.. అమెరికాలో నివసిస్తున్న ఓ పారిశ్రామిక వేత్త షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో 15లక్షల మందికి ఈ వైరస్ సోకిందని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయి.. వారిని చితికి ఆహుతి చేసిన వారి సంఖ్య 50వేలకు పైగానే వుంటుందని షాకింగ్ వివరాలను బయటపెట్టారు.