చేతి గోళ్లు అందంగా లేవనీ.. ఆ వధువు ఏం చేసిందో తెలుసా?
ఇపుడు పెళ్లికి ముందు నిశ్చితార్థం చేసుకోవడం ఓ ఆనవాయితీగా మారింది. ఆ సమయంలో కాబోయే దంపతులు ఫోటో కోసం ఎన్నో ఫోజులు ఇస్తుంటారు. పిక్ అందంగా రావడానికి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తుంటారు. అందంగా ఉండడానికి ఆరాటపడుతుంటారు.
కానీ అస్ట్రేలియాలో అందుకు భిన్నంగా జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాబోయే దంపతులు ఇద్దరూ ఫోటోకు ఫోజు ఇస్తున్న క్రమంలో తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కెమెరాకు చూపించింది. కానీ ఉంగరం తొడిగిన ఆ చేయి ఆమెది కాదు. ఎంగేజ్‌మెంట్ ఫోటో అందంగా రావాలనే ఉద్దేశంతో తన కజిన్ సిస్టర్ వేలికి రింగ్ తొడిగి ఇలా ఫోటోలకు ఫోజిచ్చింది.
ఆమె చేతి గోళ్లు అంత అందంగా లేవనే కారణంతో తన కజిన్ చేతులను తన చేతులుగా చూపిస్తూ ఇలా ఫోటోలు దిగింది. మెల్‌బోర్న్‌కు చెందిన జెన్నా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన సమయంలో ఇలా క్రియేటివిటీని ప్రదర్శించారు. ఇక ఆ ఫోటోను జెన్నా తన ట్విట్టర్‌లో ఫోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.