శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 మార్చి 2017 (14:12 IST)

బాబ్రీ మసీదు విధ్వంసం : అద్వానీ - ఉమాభారతిల మెడకు ఉచ్చు...

బాబీ మసీదు విధ్వంసం కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు కేంద్ర మంత్రి ఉమాభారతి, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీల మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 1992, డిసెంబర్‌ 6న

బాబీ మసీదు విధ్వంసం కేసులో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో పాటు కేంద్ర మంత్రి ఉమాభారతి, పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీల మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 1992, డిసెంబర్‌ 6న అయోధ్యలోని బాబ్రీ మ‌సీదు కూల్చివేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసు తుది విచారణ ఈనెల 22వ తేదీన సుప్రీంకోర్టులో జరుగనుంది. ఇదే తుది విచారణ కానుంది. అయితే, మసీదు విధ్వంసానికి అద్వానీతో పాటు జోషీ, ఉమాభారతిలో పాటు మరికొంతమంది నేతలు కుట్ర చేశారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ నేప‌థ్యంలో అద్వానీతో పాటు బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ, కేంద్రమంత్రి ఉమాభారతీ, ఇతర బీజేపీ నాయకులు ఆ మసీదు ధ్వంసానికి సంబంధించి కుట్ర చేశారనే ఆరోప‌ణ‌లు చ‌ర్చీనీయాంశంగా మారాయి. 
 
దీంతో చివరి విచారణలో బీజేపీలోని కొంద‌రు అగ్ర‌నేత‌ల‌పై ఖచ్చితంగా కుట్రపూరిత ఆరోపణలు నమోదు చేసే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ప్ర‌ధానంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లక్నో, రాయ్‌బరేలీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనలపై అద్వానీ, ఉమాభారతీకి చుట్టూ ఉచ్చు బిగుస్తుంద‌ని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ అద్వానీ, ఉమా భారతీ, మరో 19మంది నేతలకు గ‌తంలోనే సుప్రీంకోర్టు పంపించిన విషయం తెల్సిందే.