ఆదివారం, 16 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 మార్చి 2025 (20:18 IST)

Monkey : గాయపడిన వానరం.. మెడికల్ షాపుకు వెళ్లింది.. అక్కడ ఏం జరిగిందంటే? (video)

Injured Monkey Enters Medical Shop
Injured Monkey Enters Medical Shop
బంగ్లాదేశ్‌లోని మెహెర్‌పూర్ పట్టణంలో ఒక వింతైన సంఘటన జరిగింది. గాయపడిన వానరం మెడికల్ షాపుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వానరం మెడికల్ షాపులోకి వెళ్లి కౌంటర్‌ వద్ద కూర్చుంది. వెంటనే స్పందించిన మెడికల్ షాపు యజమాని.. ఆ వానరానికి ప్రథమ చికిత్స చేశారు. 
 
ఈ అసాధారణ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గాయపడి ఉన్న కోతి, మానవులు సహాయం అందించగలరని తెలిసినట్లుగా, తనంతట తానుగా ఫార్మసీలోకి నడిచింది. ఆ కోతి గాయపడిన స్థితిలో ఫార్మసీకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫుటేజీలో ఆ వానరం ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా కౌంటర్ మీద కూర్చున్నట్లు కనిపించింది. షాపు సిబ్బంది వానరానికి వైద్యం చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.