సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (12:55 IST)

సౌదీ యువరాజు ఇల్లా మజాకా? (వీడియో)

సౌదీ యువరాజు ఇల్లా మజాకా?... 888 కోట్లు... 317 గదులు... 250 బంగారు టీవీలు.. ఇదీ ఈ ఇంటికి సంబంధించిన సంక్షిప్త సమాచారం. ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సౌదీ యువరాజు ఇల్లా మజాకా?... 888 కోట్లు... 317 గదులు... 250 బంగారు టీవీలు.. ఇదీ ఈ ఇంటికి సంబంధించిన సంక్షిప్త సమాచారం. ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
 
సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్ కేవలం సౌదీలోనే కాదు, ప్రపంచంలోనే అందరికీ సుపరిచితుడైన వ్యాపారవేత్త. ఆయనది ఫోర్బ్స్ అత్యంత ధనవంతుల జాబితాలో 41వ ర్యాంక్. ‌ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి. దీంతో ఆయన ఆస్తి 19.2 బిలియన్ డాలర్ల (దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగానే)ని ఫోర్బ్స్ తెలిపింది. 
 
అయితే, ఆయనకు అత్యంత విలాసవంతమైన భవనం సౌదీ రాజధాని రియాద్‌‌లో ఉంది. దీని విలువ 130 మిలియన్ డాలర్లు (సుమారు 888 కోట్ల రూపాయలకు పైగా) ఉంటుందని అంచనా. ఇందులో వాలీద్ బిన్ తలాల్ తన ఇద్దరు భార్యలు, పిల్లలతో నివాసం ఉంటారు. 
 
ఈ రాజప్రాసాదంలో 317 గదులుండగా, అందులోని 250 గదుల్లో బంగారు పూత ఉండే 250 టీవీలు ఏర్పాటు చేశారు. అలాగే 45 సీట్లు ఉండే సినిమా థియేటర్ కూడా అందులో ఉంది. 2,500 మందికి ఒకేసారి వండిపెట్టగల వంటమనుషులు, ఏర్పాట్లు ఉన్నాయి. 
 
ఎన్నో లగ్జరీ కార్లు, ఇతర సౌకర్యాలు ఉన్న ఆ రాజభవనం... ఇంద్ర భవనాన్ని తలపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, ఇపుడది.. వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 3.91 లక్షల మంది తిలకించగా, 3 వేల మంది లైక్ చేశారు.