మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2017 (14:44 IST)

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... సినిమా టైటిల్ కాదు...

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... ఇదేం సినిమా టైటిల్ కాదు. నిజమైన పెళ్లికి సంబంధించిన వార్తే. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర దీవుల్లోని తెలుక్‌ కిజింగ్‌ గ్రామానికి చెందిన సిండ్ర అనే యువకుడు ఇ

పెళ్లికొడుకు ఒకరే.. పెళ్లికూతుళ్లు ఇద్దరు... ఇదేం సినిమా టైటిల్ కాదు. నిజమైన పెళ్లికి సంబంధించిన వార్తే. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్ర దీవుల్లోని తెలుక్‌ కిజింగ్‌ గ్రామానికి చెందిన సిండ్ర అనే యువకుడు ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోనున్నాడు. అదీ కూడా ఒకేసారి. ఇందుకోసం ఇద్దరు వధువుల పేర్లతో ఒకే శుభలేక ముద్రించి బంధుమిత్రులకు పంచేశాడు. ఇపుడిదే హాట్ టాపిక్‌‍ అయింది. 
 
సాధారణంగా ఇండోనేషియాలో బహుభార్యత్వం తప్పు కాదు. అయితే ఆ దేశ సంప్రదాయం ప్రకారం రెండో వివాహానికి ముందు కేవలం ఒక భార్య మాత్రమే ఉండాలి. ఇలా ఓకేసారి ఇద్దరిని చేసుకోవడం వారి ఆచారానికి విరుద్ధం. దీంతో చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కంటే ఎక్కువ మంది భార్యలున్న వారు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. 
 
దీనిపై వివరాలు ఆరా తీయగా, శుభలేఖ, పెళ్లి నిజమేనని తేల్చింది. ఈ పెళ్లి ఆచార సంప్రదాయాల ప్రకారమే జరుగుతోందని గ్రామ సర్పంచ్ కూడా తెలిపారు. ఇద్దరు వధువుల్లో ఒకరైన ఇందాహ్‌ లెస్తారిని నవంబర్‌ 5వ తేదీన పెళ్లి చేసుకుంటే, పెరావతిని నవంబర్‌ 8న వరుడు చింద్ర వివాహం చేసుకోబోతున్నాడు. రెండు వివాహాల మధ్య గడువు రెండు రోజులే ఉండటం వల్ల వేర్వేరు శుభలేఖలు ముద్రించడం వృథా అనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తెలిపారు.