శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (15:09 IST)

భారత్‌తో పొరుగు దేశాలకు తలనొప్పి.. కాశ్మీర్‌లో అది చట్టవిరుద్ధం..

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం దురహంకారపూరిత విస్తరణా విధానాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అందువల్లే భారత్‌కు పొరుగుగా వున్న దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాలన్నింటికీ ముప్పేనని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 
 
భారత్ తీసుకువచ్చిన పౌరసత్వ చట్టం, నేపాల్‌తో సరిహద్దు వివాదం, ఫ్లాగ్ ఆపరేషన్ తదితరాలతో భారత్ ప్రమాదకారిగా మారిందని తన సోషల్ మీడియా ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ కామెంట్స్ చేశారు.
 
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఖాన్ ట్వీట్ చేస్తూ, ''నాజీ లెబెన్‌స్రామ్ (లివింగ్ స్పేస్)కు సమానమైన హిందుత్వ ఆధిపత్య మోడీ ప్రభుత్వం దాని అహంకార విస్తరణ విధానాలతో భారతదేశ పొరుగువారికి ముప్పుగా మారుతోందన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిని "చట్టవిరుద్ధం" అంటూ అభివర్ణించారు.