2030 నాటి భారత్ ఎలా ఉంటుందంటే... అమెరికా రాయబారి కామెంట్స్...
వచ్చే 2030 నాటికి భారత్ ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తన మనసులోని మాటను వ్యక్తంచేశారు. ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నట్టుగా భారత్ ఓ బలమైన సంపన్న దేశం
వచ్చే 2030 నాటికి భారత్ ఏ విధంగా ఉండబోతుందనే విషయంపై అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తన మనసులోని మాటను వ్యక్తంచేశారు. ముఖ్యంగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భావిస్తున్నట్టుగా భారత్ ఓ బలమైన సంపన్న దేశంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇంతేకాకుండా, 2030నాటికి భారత్ అన్ని రంగాల్లోనూ ముందుంటుందని వ్యాఖ్యానించారు. భాతరదేశానికి అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా పనిచేస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే దాదాపు 110బిలియన్ల వ్యాపారం జరుగుతోందన్నారు.
యేటా ఇరు దేశాల మధ్య సుమారు 1.1 మిలియన్ల ప్రజల రాకపోకలుసాగిస్తున్నారని, 1.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసించినట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీదీ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచినట్లు ఆయన చెప్పుకొచ్చారు.