ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (13:49 IST)

పర్వతాన్ని కదిలించడం సులభం.. కానీ పీపుల్స్ ఆర్మీతో పెట్టుకోవద్దు : భారత్‌కు చైనా వార్నింగ్

సిక్కిం భూభాగమైన డోక్లాంలో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణంతో భారత్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ క్వీన్ సుతిమెత్తగా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.

సిక్కిం భూభాగమైన డోక్లాంలో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణంతో భారత్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ క్వీన్ సుతిమెత్తగా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. ద‌ళాల‌ను ముందుకు పంపి మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌ద్దు అని, ఊహాలోకంలో విహ‌రించ‌రాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. 90 ఏళ్ల పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీనీ ఎవ‌రూ ఏమీ చేయ‌లేరని, త‌మ ప‌ట్టుద‌ల కూడా స‌డ‌ల‌లేదు అని, ప‌ర్వ‌తాన్ని క‌దిలించ‌డం సులువు కానీ, పీపుల్స్ ఆర్మీతో పెట్టుకోవ‌డం అంత ఈజీ కాద‌ని వ్యాఖ్యానించడం గమనార్హం.
 
డోక్లామ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలంటే భార‌త త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, ఆ త‌ర్వాతే స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తామ‌న్నారు. బోర్డ‌ర్ ద‌గ్గ‌ర శాంతి ఉంటేనే మిగితా ప్రాంత‌మంతా శాంతియుతంగా ఉంటుంద‌ని వూ క్వీన్ అన్నారు. చైనాను త‌క్కువ‌గా అంచ‌నా వేసి మీ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌న్నారు. డోక్లామ్ స‌మ‌స్య‌తో ఇరు దేశాల మ‌ధ్య టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. వివాదాస్ప‌ద డోక్లామ్ ప్రాంతంలోనే చైనా ద‌ళాలు రోడ్డును నిర్మిస్తున్నాయి. జాతీయ భ‌ద్ర‌త‌ను, స‌మ‌గ్ర‌త‌ను కాపాడేందుకు చైనా వెనుక‌డుగు వేయ‌దన్నారు.