బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (17:10 IST)

చల్లటి శీతాకాలంలో ఎర్రటి మిరపపండ్లు తింటే...

నిజానికి కాస్తంత కారం తింటేనే తట్టుకోలేం. అబ్బో మంట అంటూ కేకలేస్తాం. అలాంటిది ఎర్రటి మిరపకాయలను ఆరగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అయ్యబాబోయ్.. ఊహించుకుంటేనే కళ్లు తిరిగిపడిపోతాం. చల్లటి శీతాకాలంలో నీటిలో ఎర్రటి మిరపకాయలు తింటూ ఎంజాయ్ చేశారు. 
 
ఇటీవల చైనాలో క్రేజీ హాట్ ఆసియన్లు అనే పేరుతో నిర్వహించిన ఈ విన్నర్ గేమ్‌ను నిర్వహించారు. క్రేజీ హాట్ ఆసియన్లు అనే పేరుతో ఈ క్రేజీ విన్నర్ గేమ్‌ను నిర్వహించారు. 
 
ఇందుకోసం నీటి కొలనులో ఎర్రటి పెద్ద మిరపపండ్లు వేస్తారు. అందులో దిగాక నిర్దేశించిన సమయంలో ఎవరు ఎక్కువ మిరపకాయలు ఆరగిస్తే వారే విన్నర్. ఈ క్రేజీ గేమ్‌లో పాల్గొన్నవారంతా సరదాగా తీసుకుని ఎంజాయ్ చేశారు. 
 
తూర్పు చైనాలో పలు ప్రదేశాల్లో ఈ గేమ్స్ ఆడుతూ ఆకట్టుకుంటున్నారు చైనీయులు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.