ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (14:45 IST)

చైనాలో మరో 42 మంది మృతి. 3 వేలు దాటిన కోవిడ్ మృతుల సంఖ్య...

కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో ఆదివారం మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. 
 
ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన వారిలో మరణాల రేటు రెండు నుంచి ఐదు శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో రెండుకు చేరింది. 
 
సింగపూర్‌లో ఉంటున్న జపాన్, మియన్మార్, ఫిలిప్పైన్స్ దేశాలకు చెందిన నలుగురికి కోవిడ్ సోకింది. దీంతో ఆ దేశంలో ఈ వైరస్ బారినపడిన వారి సంఖ్య 106కు పెరిగింది. ఇటలీలో మృతుల సంఖ్య 34కు చేరుకోగా, బాధితుల సంఖ్య 1577కు చేరింది.